ఆంధ్రప్రదేశ్‌లో టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి కానుంది. సర్వీసులో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నిరుద్యోగులు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరికీ కలిపి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఐదేళ్లకు పైగా సేవ చేసిన టీచర్లు రెండు సంవత్సరాల లోపు టెట్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.