ఏపీలో తగ్గుముఖం పట్టిన ఇంధన కొరత.. వాహనదారులకు ఊరట

ఏపీలో గత రెండు రోజులుగా తీవ్రంగా ఉన్న పెట్రోల్, డీజిల్ కొరత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఆయిల్ కంపెనీలు అదనపు ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరాను పెంచడంతో పలు జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడుతోంది. నాలుగు చక్రాల వాహనాలకు రూ.2000 వరకు, రెండు చక్రాల వాహనాలకు రూ.500 వరకు ఇంధనం అందిస్తున్నారు. గతంలో గంటన్నరకు పైగా క్యూలో నిలబడాల్సి రాగా, ప్రస్తుతం 10 నిమిషాల్లోనే ఇంధనం లభిస్తోందని వాహనదారులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు పరిస్థితిపై ఆరా తీస్తూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్