రేపే ఉత్తరాంధ్రకు గోదావరి!

AP: కూటమి ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను పూర్తి చేస్తూ దూకుడుగా ముందుకు సాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరువు సీమకు కృష్ణమ్మ నీటిని తరలించిన తర్వాత, ఇప్పుడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలకు రెగ్యులేటర్ ఆన్ చేసి జలహారతి ఇవ్వనున్నారు. రూ.4192 కోట్ల వ్యయంతో 213 కిలోమీటర్ల మేర పూర్తయిన ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరనున్నాయి. తక్షణమే 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

సంబంధిత పోస్ట్