రాయలసీమలో స్వర్ణయుగం ప్రారంభమైంది: సీఎం చంద్రబాబు

AP: కడప జిల్లా జమ్మలమడుగులో రూ.16,350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను CM చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో రాయలసీమ చరిత్రలో నవశకం మొదలైందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. విధ్వంస పాలనతో నష్టపోయిన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోస్తున్నామని, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలతో రాయలసీమ బిజీగా మారిందని, రాళ్ల సీమ కాదు రతనాల సీమ అని నిరూపిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్