ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డు ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈహెచ్‌ఎస్ కింద వైద్య సేవలు కొనసాగించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఉద్యోగులకు ఇకపై కూడా EHS వర్తింపజేయాలని బోర్డు సీఈవో పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీస్, కామర్స్ విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు.