ఏపీలో బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను మళ్లీ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి మార్చడంతో బ్రాహ్మణ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమను తిరిగి దేవాదాయ శాఖలోనే కొనసాగించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఆ డిమాండ్‌ను నెరవేర్చడంతో బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.