ఏపీలో పింఛన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్

AP: పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పింఛన్ల పంపిణీని మరింత పారదర్శకంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. కొందరు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లకుండా పింఛన్ అందిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేసేలా మార్గదర్శకాలు జారీ చేశారు. ఇకపై ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేయాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు.

సంబంధిత పోస్ట్