రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో నచ్చిన సరుకులు కొనుక్కునే విధానం

AP: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ఆధారిత 'డిజిటల్ రూపీ' విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన సరుకులకే పరిమితం కాకుండా, తమ అవసరానికి అనుగుణంగా నచ్చిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గుజరాత్‌లో అమలవుతున్న పైలట్ ప్రాజెక్ట్‌ను అధ్యయనం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్, ఈ ఏడాది చివర్లో విజయవాడ, విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్