AP: ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కిలో మీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉన్న స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ట్రావెల్ అలవెన్సులు ఇవ్వనుంది. ఇందుకోసం కేంద్రం రూ.47.91 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 79,860 మంది విద్యార్థులు అర్హులుగా తేల్చారు. తల్లుల ఖాతాలో నెలకు రూ.600 చొప్పున 3 నెలలకోసారి రూ.1800 జమ అవుతాయి.