గుడ్‌న్యూస్‌.. పౌల్ట్రీ ఫారాలకు భారీ ప్రోత్సాహకాలు

ఏపీలో పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేసేందుకు పౌల్ట్రీ డెవలప్‌మెంట్‌ పాలసీ 2026–29కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పాలసీ కింద రూ.657 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. కోళ్ల ఫారాలు, హేచరీల రుణాలపై 4% వడ్డీ రాయితీకి రూ.72 కోట్లు కేటాయించనున్నారు. కొత్త EC పౌల్ట్రీ షెడ్లకు 25% వరకు, గరిష్ఠంగా రూ.25 లక్షలు, పాత షెడ్ల ఆధునీకరణకు రూ.20 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. విద్యుత్‌ టారిఫ్‌ రాయితీలు, NLM కింద 50% వరకు క్యాపిటల్‌ సబ్సిడీ కల్పించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕