AP: రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెల్త్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఇటీవల అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 730 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖపట్నం పరిధిలో 125 మంది హెల్త్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.