ఆక్వా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: ఆక్వా రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా పథకాన్ని తీసుకొచ్చాయి. ఆక్వా రైతులు చెరువుల ద్వారా రొయ్యలు, చేపల పెంపకం చేపడుతూ ఉంటారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అవి మృత్యువాత పడతాయి. దాంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఆక్వా రైతులను ఆదుకోవడానికి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన పథకం అమలు చేస్తోంది. ఇందులో ప్రీమియం చెల్లించి బీమా లబ్ధి పొందవచ్చు. ఈ బీమా ఒక పంట కాలానికి మాత్రమే వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్