AP: రాష్ట్రంలోని పాఠశాలలకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి 28 వరకు అన్ని స్కూళ్లలో 'శిక్షా సప్తాహ్' నిర్వహించాలని వెల్లడించింది. జాతీయ విద్యావిధానం సంస్కరణలను తెలియజేసేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్లు, తల్లులను భాగస్వామ్యం చేయాలని తెలిపింది. 22న బోధన అభ్యసన సామగ్రి ప్రదర్శన, 27న మొక్కలు నాటడం, 28న సహపంక్తి భోజనాలు నిర్వహించాలని పేర్కొంది.