ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మార్పులు!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లను ఇకపై ప్రజలే నేరుగా ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని అమలు చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం అమలైతే స్థానిక సంస్థలు మరింత బలోపేతం కావడంతో పాటు అవిశ్వాస తీర్మానాల సమస్యకు కూడా చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఎంపీపీలను ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లను జెడ్పీటీసీలు ఎన్నుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్