AP: కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. కలెక్టర్ స్వప్నిల్ ఆధ్వర్యంలో టెక్కలి ఆర్డీవో, ఏఎస్పీ, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌లతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, గాయపడిన వారికి చికిత్స అందించమని సూచించింది. బాధ్యుల నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.