రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: విశాఖలోని రుషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన భవనాలను లీజుకు ఇచ్చేందుకు ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆసక్తి వ్యక్తీకరణ (EOI) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భవనాలు రెండేళ్లుగా వినియోగంలో లేకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. మంత్రి వర్గ ఉపసంఘం వీటిని లగ్జరీ రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని సూచించగా, లీజు ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. అయితే CRZ, NGT కేసుల నేపథ్యంలో తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్