ఏపీలో విద్యా ఫీజులు 10 శాతం పెంపు?

AP: విద్యా ఫీజుల నియంత్రణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ  కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఫీజుల నియంత్రణ కమిటీకి చైర్‌పర్సన్ నియామకం ఆలస్యమవడంతో కొత్త ఫీజుల ఖరారు ప్రక్రియ వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులకే 10 శాతం పెంపు చేసి కొనసాగించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఉన్నత విద్యా కోర్సుల ఫీజులను సవరించే విధానం అమల్లో ఉన్నప్పటికీ, కమిటీ ఏర్పాటులో జాప్యం కారణంగా బీటెక్‌తో పాటు ఇతర డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది.

సంబంధిత పోస్ట్