ఏపీ ప్రభుత్వం గ్రామాల్లో స్వచ్ఛతను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పాడైన ప్లాస్టిక్, అల్యూమినియం, ఐరన్ వంటి వస్తువులను కొనుగోలు చేసి, వాటికి బదులుగా నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు గ్రీన్ షాపులను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రయోగాత్మక పథకాన్ని ముందుగా తిరుపతి, కృష్ణా జిల్లాల్లో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ రథాలు తిరగని ప్రాంతాల్లో దశలవారీగా ఈ షాపులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య ద్వారా ప్లాస్టిక్, లోహ వ్యర్థాల నిర్వహణతో పాటు ప్రజలకు నిత్యావసరాల అందుబాటును మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.