AP: గ్రూప్-1 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నట్లు సమాచారం. బుధవారం జరిగిన విచారణలో కోర్టు ఆదేశాలకు లోబడి ఫలితాలు ఇవ్వవచ్చని హైకోర్టు తెలిపింది. క్రీడా కోటా కేసులో స్టే లేకపోవడంతో ఏపీపీఎస్సీ ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధమైంది. 2023 డిసెంబర్‌లో 81 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, 2024 మార్చిలో ప్రిలిమ్స్, 2025 మేలో మెయిన్స్, జూన్‌లో ఇంటర్వ్యూలు జరిగాయి.