తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ప్రత్యేక అధికారి సిసోడియా సూచించారు. గుంటూరు కలెక్టరేట్లో ఆదివారం తుఫాను సహాయ చర్యల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను ఆయన పరిశీలించారు. కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవాలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.