రోడ్డు ప్రమాదాల నివారణకు బాపట్ల జిల్లా పోలీసుల చర్యలు

బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శబి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా రహదారులపై భద్రతా చర్యలు చేపట్టారు. ప్రమాదాలు జరిగిన ప్రదేశాలలో, బాటసారులు రహదారులు దాటే చోట్ల జీబ్రా క్రాసింగ్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. సూచక బోర్డులపై రెడియం స్టిక్కర్లు అతికించి, రాత్రి వేళల్లోనూ అవి స్పష్టంగా కనిపించేలా చేస్తున్నారు. ఎద్దుల బండ్లకు కూడా రెడియం స్టిక్కర్లు అమర్చుతున్నారు. ఈ చర్యలు వాహనదారులను అప్రమత్తం చేసి, రోడ్డు ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల రూరల్ సీఐ శేషగిరి, వేటపాలెం ఎస్సై జనార్ధన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్