కొరిసపాడు: మెదరమెట్ల ఆర్టీసీ బస్టాండ్ తనిఖీ

కొరిశపాడు మండలం మేదరమెట్ల ఆర్టీసీ బస్టాండ్‌ను బుధవారం జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యాలైన తాగునీటి సదుపాయం, శుభ్రత తదితర అంశాలను ఆయన పర్యవేక్షించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్