కొరిశపాడు మండలం పమిడిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా జాగర్లమూడి జయ కృష్ణ, సభ్యులుగా తలపనేని శీను, మాలంపాటి లక్ష్మి లను నియమిస్తూ సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. జయకృష్ణ మొదటి నుంచి టిడిపిలో చురుగ్గా ఉంటూ ప్రస్తుతం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మంత్రి రవికుమార్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన తెలిపారు.