కొరిశపాడు: అధ్వానంగా రావినూతల రహదారి

కొరిశపాడు మండలం రావినూతల నుంచి దైవాలరావూరు వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా మారిందని, అడుగడుగునా లోతైన గుంతలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు వాహనదారులు శనివారం ఆరోపించారు. వాహనాలు దెబ్బతినడంతో పాటు రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నామని వారు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్