బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఎస్ఐగా అనిల్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో చీరాల వన్ టౌన్ ఎస్సైగా పనిచేసిన అనిల్ కుమార్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. పేకాట, కోడిపందాలు వంటివి జరిగితే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.