వాణిజ్య పన్నుల వసూళ్లలో బాపట్ల ప్రథమ స్థానంలో ఉండాలి

బాపట్ల జిల్లా వాణిజ్య పన్నుల వసూళ్లలో ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో జరిగిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ పన్నుల వసూలు సకాలంలో జరగాలని, రాష్ట్రానికి రావాల్సిన పన్నులు పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. బాపట్ల జిల్లా జీఎస్టీ రూపంలో 35 కోట్లు చెల్లిస్తుందని, ట్రేడ్ లైసెన్సుల జాబితాలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్