బాపట్లలో పారిశుద్ధ్య పనులపై కమిషనర్ తనిఖీలు..!

బాపట్ల పట్టణంలోని పలు వార్డులు, జీబీసీ రోడ్డులో మున్సిపల్ కమిషనర్ ఎం. హాసిని శుక్రవారం పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. రోడ్లపై చెత్త పేరుకుపోకుండా ప్రతిరోజూ శుభ్రత పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం 23వ వార్డు వివేకానంద కాలనీలోని పార్కును సందర్శించి అభివృద్ధి పనులను సమీక్షించారు. పార్కును ప్రజలకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఈ కృష్ణారెడ్డికి సూచించారు.

సంబంధిత పోస్ట్