నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడంలో డెడికేటెడ్ కోర్టు పోలీస్ పర్సన్స్ బృందం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బృందంతో ఆయన సమావేశమయ్యారు. నిందితులకు విధించే జైలు శిక్షల శాతం పెంచే లక్ష్యంతో, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమిస్తూ జిల్లాలో డిస్ట్రిక్ట్ కోర్ట్ మానిటర్ సెల్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నేర నియంత్రణ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.