బాపట్ల డీఎస్పీ జగదీష్ నాయక్ శుక్రవారం రాత్రి బాపట్ల నుండి బెంగళూరు, హైదరాబాద్ వెళ్లే బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు. బస్సుల్లో ప్రయాణికులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా బయటకు వెళ్లాలో డ్రైవర్లు ముందుగానే తెలియజేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.