బాపట్ల పట్టణంలో రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు సీఐ రాంబాబు బుధవారం సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. చీల్ రోడ్‌లోని రామాలయం సెంటర్ వద్ద ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను తనిఖీ చేసి, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన పత్రాలు, హెల్మెట్, సీటుబెల్ట్ వంటి భద్రతా అంశాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి సూచనలు, సలహాలు ఇచ్చి, నిబంధనలు పాటించాలని సూచించారు.