అమరావతిలో నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలి సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. జనాభా పెరుగుదల ప్రభావాలు, ఎదుర్కొనే సవాళ్లు వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాలకులు, నిపుణులు పాల్గొననున్నారు.