టోల్ ప్లాజా వద్ద “శిరోరక్ష–ప్రాణరక్ష” అవగాహన కార్యక్రమం

చందోలు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో గురువారం రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద “శిరోరక్ష–ప్రాణరక్ష” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్