బాపట్లలో ముమ్మరంగా ఫిల్లింగ్ స్టేషన్లు తనిఖీలు

రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో, ప్రభుత్వ ఆదేశాల మేరకు బాపట్ల పట్టణంలోని పలు ఫిల్లింగ్ స్టేషన్లను మంగళవారం విజిలెన్స్, సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. పెట్రోల్ నిల్వలను పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే ఫిల్లింగ్ స్టేషన్లను సీజ్ చేస్తామని అధికారుల హెచ్చరిక జారీ చేశారు. క్షేత్రస్థాయిలో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

సంబంధిత పోస్ట్