పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే చెత్త, మురుగును పద్ధతి ప్రకారం తొలగించాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆదేశించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు గురువారం కలెక్టరేట్ లో జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఘన వ్యర్థాల నిర్వహణ, తొలగింపుపై మునిసిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని, పర్యావరణ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, చెత్తతో సంపద సృష్టించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.