కంకటపాలెంలో బంక్‌పై అధికారుల సడన్ తనిఖీలు

బాపట్ల మండలం కంకటపాలెం రహదారిలోని నవీన్ సహస్ర పెట్రోల్ బంక్‌లో సోమవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తహశీల్దార్ షలిమా, సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ ఫణికుమార్ ఈ పరిశీలనలో పాల్గొన్నారు. బంక్‌లో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలను సమగ్రంగా తనిఖీ చేసి, ప్రస్తుత స్టాక్ వివరాలు, సరఫరా విధానం గురించి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్