బాపట్ల జిల్లాలో ప్రఖ్యాత విద్యా ప్రదాత కీర్తిశేషులు ముప్పలనేని శేషగిరిరావు విగ్రహాన్ని బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని ఆయన కుమారుడు ముప్పలనేని శేషు సుమంత్ కుమార్, అభిమానులు మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మను కలిసి వినతి పత్రం అందించారు. వినతి పత్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, త్వరలో నిర్ణయం తీసుకొని విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.