బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను డీఆర్ఎ గంగాధర్ గౌడ్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో కార్యాలయం కిక్కిరిసింది. అర్జీదారులకు భోజనం, వసతి ఏర్పాటు చేశారు. వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.