ఈనెల 27న (సోమవారం) చీరాల ఐ-టౌన్ పోలీస్ స్టేషన్‌లో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదివారం తెలిపారు. చీరాల నియోజకవర్గంతో పాటు మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చిన్నగంజాం, వేటపాలెం ప్రజలకు అందుబాటులో ఉండేలా పిజిఆర్ఎస్ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.