బాపట్ల జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్, సాంఘిక సంక్షేమ, డీఆర్‌డీఏ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్త్రీనిధి రుణాల పంపిణీ లక్ష్యానికి తగిన పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని, ఎన్పీఏలు అధికంగా ఉన్న మండలాల్లో వసూళ్లను పెంచి రుణాల తిరిగి చెల్లింపులను మెరుగుపరచాలని ఆదేశించారు. పథకాల అమలులో పారదర్శకత, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.