గుంటూరు జిల్లా పొన్నూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ గా యల్. వెంకటేశ్వరరావు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. డిపో అభివృద్ధికి ఉన్నతికి సిబ్బంది సమన్వయంతో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం పొన్నూరు నుంచి వివిధ రూట్లకు నూతన బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన మేనేజర్ వెంకటేశ్వరరావును పలువురు సిబ్బంది అభినందించారు.