చిలకలూరిపేటలోని ప్రభుత్వ పాఠశాలల సమీపంలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అర్బన్ సీఐ రమేష్ హెచ్చరించారు. శుక్రవారం 'ఆపరేషన్ సేఫ్ క్యాంపస్' కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఆయన, స్కూళ్ల 100 మీటర్ల పరిధిలోని షాపుల్లో తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.