ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ నందలి భాగంగా ఇంటి నివేశ స్థలం లేని నిరుపేదలందరూ మీ సమీప సచివాలయంలో ఇంటి నివేశ స్థలం మంజూరుకై అర్జీలు దాఖలు చేసుకోవాలని తహసిల్దార్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. అర్జితోపాటు రేషన్ కార్డు, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో అర్జీ దాఖలు చేసుకోవాలని తెలిపారు.