గాంధీ పార్క్ షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట ఎవరూ దక్కించుకోలేదు

చిలకలూరిపేటలోని గాంధీ పార్క్ షాపింగ్ కాంప్లెక్స్‌లో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు ఆధ్వర్యంలో షాపుల వేలంపాట జరిగింది. దుకాణదారులు పాల్గొన్నప్పటికీ, అధిక రేట్లు కారణంగా ఎలాంటి దుకాణాలు వేలం దక్కించుకోలేకపోయాయి. గతంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హయాంలో జరిగిన వేలంలో ప్రజలు ఆసక్తి చూపగా, ఈసారి అంతగా ఆసక్తి కనబరచలేదని కమిషనర్ తెలిపారు. మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేలంలో మున్సిపల్ ఆర్వో సుబ్బారావు, ఆర్థిక శాఖ అధికారి గిరి, ఖాదర్‌లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్