చిలకలూరిపేట ఏపీఎస్‌ఆర్టీసీ డిపో నూతన మేనేజర్‌గా యద్దనపూడి వేణుబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన మేనేజర్ బదిలీ కావడంతో, భీమవరం నుండి బదిలీపై వచ్చిన వేణుబాబు ఆ బాధ్యతలను చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో కూడా తాను చిలకలూరిపేట డిపోలో పనిచేసిన అనుభవం ఉందని గుర్తుచేసుకున్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.