రిటైర్డ్ శ్రీదేవికి ఘన సన్మానం: ఉద్యోగుల సంఘం నివాళి

సోమవారం రాత్రి చీరాలలోని ఎంప్లాయిస్ యూనియన్ ఆఫీసులో, రాష్ట్రోపాధ్యాయ సంఘం చీరాల డివిజన్ ఆధ్వర్యంలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఏ శ్రీదేవి గారికి ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ కు ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు బాపట్ల జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాస్, జిల్లా ఆర్థిక కార్యదర్శి పివి నాగరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్, చీరాల ఎస్ టి యు ప్రతినిధులు ప్రభాకర్ రావు, యేసు రత్నం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్