బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశం: ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, అర్జీలను నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో విచారించి, పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. మహిళలు, వృద్ధుల ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు వంటి వివిధ సమస్యలతో 83 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పరిష్కార చర్యల నివేదికను పోలీస్ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్