చీరాలలో అధికారులపై కలెక్టర్ అసహనం

జిల్లాలో ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. చీరాల నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని పురోగతిని సమీక్షించారు. మ్యాపింగ్‌లో జాప్యం, డూప్లికేట్ ఓట్లు, తప్పుడు నమోదులపై ఆయన ఆరా తీశారు. లాగిన్ వినియోగంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వెంటనే సరిచేసుకోవాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్