సోమవారం కారంచేడు మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. మండలంలోని పలు పెట్రోల్ బంకులను స్వయంగా తనిఖీ చేసి, నిర్వహణ తీరును పరిశీలించారు. ఇంధనం నింపుకోవడానికి వచ్చిన వాహనదారులతో నేరుగా మాట్లాడి, పెట్రోల్, డీజిల్ కొలతల్లో తేడాలు, అదనపు ధరల వసూళ్లపై ఆరా తీశారు. వినియోగదారుల సేవలపై అభిప్రాయాలు సేకరించి, బంకు యజమానులకు పలు సూచనలు జారీ చేశారు.