ఈహెచ్‌ఆర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: జిల్లా వైద్యాధికారి

బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈరోజు (29-01-2026) ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో ఈహెచ్‌ఆర్ రిజిస్ట్రేషన్‌పై సమావేశం జరిగింది. జిల్లా వైద్యాధికారి డా. ఎస్. విజయమ్మ మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో రోగులకు అందించే వైద్య సేవలను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఓపీ, వైద్య పరీక్షలు, సర్జరీ కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. ప్రతి ఆసుపత్రిలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మసీ ఉద్యోగులు తప్పనిసరిగా ఈహెచ్‌ఆర్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డెమో బి. మరియమ్మ, డిపిఓ ప్రేమ పావని, డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్