బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా, దివ్యాంగుల సౌకర్యార్థం ఎస్ఐ జనార్ధన్ బుధవారం ఒక ర్యాంప్‌ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. దివ్యాంగులు ఎదుర్కొనే సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, పోలీస్ శాఖ వారికి అందుబాటులో ఉంటుందని ఎస్ఐ జనార్ధన్ తెలిపారు.